స్వచ్ఛతకే ప్రాధాన్యం
ABN, First Publish Date - 2020-10-03T09:21:49+05:30
‘‘జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్ఛతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. డంప్ యార్డులు అధికారిక సమావేశాలకు
మహాత్మాగాంధీకి అదే నిజమైన నివాళి: కేటీఆర్
యాదాద్రి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్ఛతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. డంప్ యార్డులు అధికారిక సమావేశాలకు వేదికలుగా మారిన పరిస్థితి.. పారిశుధ్యంపై మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రతీక’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డంప్ యార్డులను స్వచ్ఛతకు ప్రతీకగా, ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దుతూ రిసోర్స్ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా స్వచ్ఛత దివ్‌సను పురస్కరించుకుని శుక్రవారం యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
పారిశుధ్య నిర్వహణలో మెరుగ్గా ఉన్న మునిసిపాలిటీకు ఐదు కేటగిరీల్లో పట్టణ ప్రగతి పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఏటా ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి దినోత్సవంలో వీటిని అందజేస్తామని పేర్కొన్నారు. దేశంలో ఓడీఎఫ్ డబుల్ ప్లస్ సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. భువనగిరిలో ప్రధాన రహదారి విస్తరణకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. పట్టణ ప్రగతి పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణకు పీపీటీఎంఎస్ యాప్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ యాప్ సాయంతో మునిసిపాలిటీల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన టాయిటెట్స్ నిర్వహణకు అధికారులు పర్యవేక్షించనున్నారు.
Updated Date - 2020-10-03T09:21:49+05:30 IST