ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యాపేటలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది: మంత్రి జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-04-28T22:43:25+05:30

నల్లగొండ: నల్లగొండ కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, బత్తాయి ఎగుమతులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: నల్లగొండ కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, బత్తాయి ఎగుమతులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జలాల్లో కరోనా కట్టడి చర్యలు భేష్ అన్నారు. సూర్యాపేటలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్నారు. 


గత 6 రోజులుగా ఒక్క పాజిటివ్  కేసు కూడా నమోదు కాలేదన్నారు. ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడులు వచ్చాయని జగదీష్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. గన్ని బ్యాగ్స్, ట్రాన్స్ పోర్ట్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని. రైతును రాజును చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 


తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని జగదీశ్ రెడ్డి కొనియాడారు.


Updated Date - 2020-04-28T22:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising