ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపు రైతుల్ని ఆదుకుంటాం: మంత్రి జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-10-02T02:08:00+05:30

వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. చింతలపాలెం మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు. చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్ట్ వరద తాకిడికి నష్టపోయిన బుగ్గమాధారం, వజినేపల్లి ముంపు ప్రాంతాన్ని మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మంత్రి మాట్లాడారు. పులిచింతలకు భారీ మొత్తంలో వరదలు రావడం వల్ల ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాలు ఏటా ముంపునకు గురై రైతులు నష్టపోతున్నారని మంత్రి తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు దిగువన మూలమలుపు ఉండటం వల్ల వరద నీరు గ్రామాల్లోకి వచ్చి ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

Updated Date - 2020-10-02T02:08:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising