ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాలపై నిర్ణయం: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-06-06T18:24:42+05:30

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాలపై నిర్ణయం: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: ఈనెల 8 నుంచి రాష్ట్రంలో ఆలయాలు తెరుచుకుంటాయని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ దర్శనంపై అర్చకులు, సిబ్బంది రేపు ట్రయల్ రన్ నిర్వహిస్తారని చెప్పారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని... ఆలయాలను శానిటైజ్ చేయడంతో పాటు భక్తులను పరీక్షించిన తర్వాతే లోనికి అనుమతి ఇస్తామని తెలిపారు. భక్తులు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆలయాల్లో శఠగోపాలు, తీర్థ ప్రసాదాలు ఉండవన్నారు. ప్రత్యేక పూజలు ఉండవని, సాధారణ దర్శనాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. బోనాలపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరాడంబరంగానే జరిగే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2020-06-06T18:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising