కాళోజీ ఆశయ సాధనలో ముందుకు వెళ్లాలి:ఇంద్రకరణ్ రెడ్డి
ABN, First Publish Date - 2020-11-14T00:10:57+05:30
ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయ సాధనతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయ సాధనతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కాళోజీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకున్నారు. తన యాస, భాషతో తెలంగాణ ఉద్యమానికి కాళోజీ ఊపిరి పోశారని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
భాషను, సాహిత్యాన్ని, రాజకీయాలను, సంఘసంస్కరణలను ఉమ్మడిగా మేళవించి సమసమాజ నిర్మాణం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు కాళోజీ అని ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తర్వాత కవులు, కళాకారులకు, సాహితీ వేత్తలకు గుర్తింపు లభించిందన్నారు. సీఎం కేసీఆర్ కాళోజీకి సముచిత గౌరవం కల్పించారని, కాళోజీ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.
Updated Date - 2020-11-14T00:10:57+05:30 IST