ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగాతో రోగనిరోధక శక్తి

ABN, First Publish Date - 2020-06-22T09:22:16+05:30

యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం చేకూరుతుందని, మనుషుల్లో రోగనిరోధక శక్తి అద్భుతంగా పెంపొందుతుందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శారీరక, మానసిక దృఢత్వం: హరీశ్‌

యోగా దేశ వారసత్వ సంపద: సంజయ్‌ 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం చేకూరుతుందని, మనుషుల్లో రోగనిరోధక శక్తి అద్భుతంగా పెంపొందుతుందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి సిద్దిపేట జిల్లా యోగా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన యోగాసనాలు వేశారు. యోగా భారతదేశ  వారసత్వ సంపద అని బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. యోగా ద్వారా కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు పాల్గొంటున్నా, సీఎం కేసీఆర్‌ పాల్గొనకపోవడం పట్ల సంజయ్‌ విస్మయం వ్యక్తం చేశారు.


శరీరం, మనస్సు సమతుల్యం: గవర్నర్‌

మనస్సును, శరీరాన్ని, ఆలోచనలను యోగా సమతుల్యం చేస్తుందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను ఒక భాగంగా మలుచుకోవాలని గవర్నర్‌ సూచించారు.

Updated Date - 2020-06-22T09:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising