ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాల ఉత్పత్తుల్లో సరికొత్త బ్రాండ్ ఆవిష్కరించిన మంత్రి హరీష్ సతీమణి

ABN, First Publish Date - 2020-08-22T01:06:41+05:30

నాణ్యమైన, స్వచ్ఛని పాల ఉత్పత్తుల కోసం సరికొత్త బ్రాండ్ ‘మిల్చి మిల్క్’ను ఆర్థిక మంత్రి హరీష్ రావు సతీమణి తన్నీరు శ్రీనిత ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : నాణ్యమైన, స్వచ్ఛని పాల ఉత్పత్తుల కోసం సరికొత్త బ్రాండ్ ‘మిల్చి మిల్క్’ను ఆర్థిక మంత్రి హరీష్ రావు సతీమణి తన్నీరు శ్రీనిత ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం ఈ ఆవిష్కరణ అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. కరోనా వంటి ఆనారోగ్యకర పరిస్థుతులు ప్రస్థుతం ఏర్పడ్డాయని.. ప్రతీ ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఇందుకు మనం రోజూ తీసుకునే స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పారు. 


తమ బ్రాండ్  మిల్చి మిల్క్ స్వచ్ఛమైన తాజా పాల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, సప్లై పూర్తి హైజెనిక్ పద్దతిలో నిర్వహించబడుతాయన్నారు. వినియోగ దారులకు సంపూర్ణంగా నమ్మదగిన పాల ఉత్పత్తులు ‘మిల్చీ బ్రాండ్’ అని తెలిపారు. ప్రతిరోజూ పాలను సేకరిస్తూ అనుభవజ్ఞులైన నిర్వాహకుల ఉద్యోగుల పర్యవేక్షణలో చిల్లింగ్ కేంద్రాలు, బల్క్ కూలర్లు, ప్యాకింగ్ స్టేషన్ల ద్వారా మొత్తం సరఫరా మార్గాలపై కఠినమైన నియంత్రణతో వినియోగదారుల ఇంటి వద్దకే తాజా స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను పంపిణీ చేస్తామని తన్నీరు శ్రీనిత తెలిపారు.

Updated Date - 2020-08-22T01:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising