ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైజాగ్ ఘటనతో అప్రమత్తమయ్యాం : మంత్రి హరీష్

ABN, First Publish Date - 2020-05-18T17:58:10+05:30

మరీ ముఖ్యంగా.. వైజాగ్ ప్రమాద ఘటనతో జిల్లాలో అప్రమత్తం అయ్యామమన్నారు. ‘

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి : పరిశ్రమల కాలుష్యం, కరోనా నివారణకి తీసుకుంటున్న చర్యలపై ఇండస్ట్రీ యాజమాన్యాలతో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ విషయాల్లో అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నట్లు ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. యాజమాన్యాలు బస్సుల్లో కనీస దూరం లేకుండా కార్మికులను తరలిస్తున్నారని వ్యాఖ్యానించారు. కరోనా జాగ్రత్తలు తీసుకోకుంటే కఠినంగా ఉంటామన్నారు. 


జాగ్రత్తలు తీసుకోవాలి..

మరీ ముఖ్యంగా.. వైజాగ్ ప్రమాద ఘటనతో జిల్లాలో అప్రమత్తం అయ్యామమన్నారు. బాయిలర్, ఫైర్, సేఫ్టీ వాళ్ళు సరిగా ఇండస్ట్రీలను చెక్ చేయడం లేదనుకుంటున్నాను. జిల్లాలో గత సంవత్సరం ఇండస్ట్రీ ప్రమాదాలతో 20 మంది చనిపోయారు. గ్యాస్, బాయిలర్ వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిశ్రమల నుంచి రాత్రి సమయంలో విష వాయువులు వదులుతున్నట్లు మా దృష్టి కి వచ్చింది. సేఫ్టీ ఆఫీసర్స్ వాళ్ళ పని చేయడం లేదు. కంపెనీలల్లో కచ్చితంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి మంత్రి హరీష్ తెలిపారు.

Updated Date - 2020-05-18T17:58:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising