ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వడ్డీ లేని రుణ పథకాల బకాయిలు చెల్లించండి’

ABN, First Publish Date - 2020-08-05T01:40:59+05:30

మహిళ బ్యాంక్‌లకు వడ్డీ లేని ఋణ పథకాల బకాయిలు చెల్లించాలని కోరుతూ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, స్నేహ మహిళ మాక్స్ ప్రతినిథులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మహిళ బ్యాంక్‌లకు వడ్డీ లేని ఋణ పథకాల బకాయిలు చెల్లించాలని కోరుతూ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, స్నేహ మహిళ మాక్స్ ప్రతినిథులు.. రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత స్వయం సహాయక సంఘాల వడ్డీలేని రుణాలు పథకాల సబ్సిడీలు విడుదల చేయాలని, ఇప్పటికే తీసుకున్న రుణాలకు అప్పులు తీర్చిన లబ్ధిదారులకు నగదు జమ కాలేదని మంత్రికి వివరించారు. 13 మహిళా సొసైటీలకు సంబంధించి రూ. 13 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు వారికి వివరించారు. ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 99% రికవరీతో అప్పులను తిరిగి చెల్లించుకుంటూ అభివృద్ధి చెందుతున్నాయని మంత్రికి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తిపై మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డి తో పాటు 13 మహిళా బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-05T01:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising