ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతు రాజ్యం: హరీష్ రావు

ABN, First Publish Date - 2020-05-13T23:46:55+05:30

టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిజమైన రైతు రాజ్యం వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నిమ్రా గార్డెన్‌లో ముస్లిం మహిళలకు రంజాన్ పండుగ కానుకలను మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిజమైన రైతు రాజ్యం వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నిమ్రా గార్డెన్‌లో ముస్లిం మహిళలకు రంజాన్ పండుగ కానుకలను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. అదేవిధంగా కొండా భూదేవి గార్డెన్‌లో సిద్దిపేట రూరల్ మండలంలో 209 మందికి, సిద్దిపేట అర్బన్ మండలంలోని 305 మందికి పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. లాక్‌డౌన్ వల్ల ప్రజల జీవనం ఇబ్బందిగా మారిందన్నారు. కరోనాకి మందు రావడానికి ఇంకా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాలించాలని హరీష్ రావు సూచించారు. మాస్క్‌ లేకుండా బయట తిరిగితే రూ.1000 జరిమానా తప్పదని హెచ్చరించారు. కాళేశ్వరం నీళ్లు వచ్చాక మొదటిసారి పట్టాల పంపిణీ జరుగుతోందన్నారు. రైతులు పెద్ద మనసుతో సహకరించి కాలువల భూ సేకరణకు సహకరించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఎంతో మంది రైతులు సహకరిస్తేనే కాళేశ్వరం నీళ్లు ఇక్కడి వరకు వచ్చాయన్నారు. భూసేకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిజమైన రైతు రాజ్యం వచ్చిందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ సూచనలను పాటిస్తూ రైతులు ముందుకు వెళ్లాలని హరీష్ రావు సూచించారు.

Updated Date - 2020-05-13T23:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising