ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబ్బాక అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో చేసింది- హరీశ్‌రావు

ABN, First Publish Date - 2020-09-18T22:45:04+05:30

దుబ్బాక నియోజక వర్గం అభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఆర్దిక మంత్రి హరీశ్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: దుబ్బాక నియోజక వర్గం అభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఆర్దిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీటిని అందించాం. త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు. జిల్లాలోని మిరుదొడ్డి మండల టీఆర్‌ఎస్‌ విద్యార్ది, యువత అనుబంధ సంఘాల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు అభ్యర్ధిలేడు, బీజేపీకి కార్యకర్తలులేరని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో ఎవరు గెలుస్తారని యువకుల నుంచి పండు ముసలిని అడిగినా టీఆర్‌ఎస్‌ గెలుస్తుందనే చెబుతారని అన్నారు.


ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌పార్టీని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీశ్‌రావుపిలుపునిచ్చారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌, బీజేపీలకు డిపాజిట్లు వస్తాయా?అనేది తెలుసుకోవడం కోసమే ఈ ఉపెన్నికలని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు దుబ్బాక ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. మిషన్‌భగీరధతో మంచినీళ్ల బాధలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో తొలగిపోయాయనే సంతోషంతో ఉన్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-09-18T22:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising