ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ సంక్షేమ శాఖ పధకాలపై మంత్రి గంగుల సమీక్ష

ABN, First Publish Date - 2020-06-23T00:55:39+05:30

బీసీ సంక్షేమశాఖ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సోమవారం తన కార్యాలయంలో బిసి సంక్షేమశాఖలో జరుగుతున్న వివిధ పథకాలపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌:బీసీ సంక్షేమశాఖ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సోమవారం తన కార్యాలయంలో బిసి సంక్షేమశాఖలో జరుగుతున్న వివిధ పథకాలపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాబోయే 2020-21 విద్యా సంవత్సరానికి మహాత్మాజ్యోతిబా పూలేహాస్టల్‌ విద్యార్ధులకు, బీసీ హాస్టల్‌లో ఉన్న విద్యార్ధులకు అవసరమైన సౌకర్యాలు, మెరుగైన వసతుల కల్పనపై చర్చించారు. బీసీ కార్పొరేషన్‌, ఎంబిసి కార్పొరేషన్‌, వివిధ ఫెడరేషన్‌లకు గతంలో ప్రభుత్వం కేటయించిన బడ్జెట్‌ వివరాలు, ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలు, భవిష్యత్తులో చేపట్టబోయే పథకాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో బీసీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మామీలను పూర్తిస్తాయిలో అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి వి. సైదా, బీసీ కార్పొరేషన్‌ ఎండి అలోక్‌కుమార్‌, జ్యోతిబాపూలె కార్యదర్శి మల్లయ్యభట్టు, రజక ఫెడరేషన్‌ఎండి చంద్రశేఖర్‌, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌   ఎండి ఉద య్‌ ప్రకాశ్‌, వడ్డెర ఫెడరేషన్‌ ఎండి బాలాచారి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-23T00:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising