ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలు ప్రజలకు తెలియాలె

ABN, First Publish Date - 2020-03-29T20:49:50+05:30

ప్రభుత్వము...ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న అన్ని చర్యలూ ప్రజలకు తెలియాలని గ్రామీణాభివృద్ధి,పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రభుత్వము...ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న అన్ని చర్యలూ ప్రజలకు తెలియాలని గ్రామీణాభివృద్ధి,పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. కరోనా నిర్మూలనకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలు సమన్వయంతో పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసందర్భంగా గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తోకలిసి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎస్పీలు, కలెక్టర్లు, వైద్యాధికారులు, రవాణా, వ్యవసాయ, పౌరసఫరాలు, రెవెన్యూ,పంచాయితీరాజ్‌ శాఖల అధికారులతో మాట్లాడారు. అన్నదాత రైతన్నల పంటలు చేతికి వచ్చే సమయానికి కరోనా వైరస్‌ ప్రబలడంతో వాళ్లు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్నతో సహా ప్రతి గింజను కొనుగోలుచేసే బాద్యతను ప్రభుత్వం తీసుకున్నదని చెప్పారు. గ్రామాలకే కొనుగోలుకేంద్రాలు వెళతాయని రైతులఽ ధాన్యాన్ని కొంటుందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు మిగితా దేశాలకంటే కూడా బాగున్నాయని, ప్రజలుగా మనం చేయాల్సిందిల్లా మనం ఇండ్లకే పరిమితం కావాలన్నారు. ప్రజా ప్రతినిధులంతా కలిసి ప్రజలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ప్రజా ప్రతినిధులదేనని అన్నారు. 

Updated Date - 2020-03-29T20:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising