ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను- ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-09-18T21:53:13+05:30

కరోనా సోకితే భయపడకండి...మీకు మనో ధైర్యం ఇవ్వడం కోసమే ప్రతి రోజూ టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్టు పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనా సోకితే భయపడకండి...మీకు మనో ధైర్యం ఇవ్వడం కోసమే ప్రతి రోజూ టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్టు పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. కరోనా బాధితుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.పాలకుర్తినియోజక వర్గంలోని కరోనా బాఽధితులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఒక వైపు బాఽధితులుకు భరోసా కల్పిస్తూ మరో వైపు ప్రజా ప్రతినిధులకు సూచనలు చేశారు. బాఽధితుల బాధలుతెలుసుకుంటూ తనదైన శైలిలో వారికి సూచనలు చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కరోనా నుండి ప్రజల్ని గట్టెక్కించాలని సూచించారు. 


సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ సమన్వయంతో కరోనా నుంచి తెలంగాణను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బాధితులు అందరూ కూడా ఆహారం ఏదైనా వేడి వేడిగా తినాలన్నారు. వరంగల్‌ ఎంజిఎం హాస్పిటల్‌లో మంచి వైద్యం అందుబాటులో ఉందని చెప్పారు. కరోనా బాధితుల్ని ఆదుకోవాలని ప్రజా ప్రతినిధులకు మంత్రి సూచించారు. తాను సొంత ఖర్చుతో మాస్కులు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కరోనా ఎమెర్జెన్సీ పేషెంట్ల కోసం అంబులెన్స్‌ వాహనాలను కూడా సిద్ధం చేశామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. 

Updated Date - 2020-09-18T21:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising