ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15వ ఆర్థిక సంఘం నిధుల్లో 308 కోట్లు విడుదల

ABN, First Publish Date - 2020-08-15T09:33:02+05:30

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా తెలంగాణకుమొదటి విడతగా రూ.308 ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలకు 5, మండలాలకు 10 శాతం

వాననీటి సంరక్షణ వంటి పనులు చేపడతాం: ఎర్రబెల్లి 


హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా తెలంగాణకుమొదటి విడతగా  రూ.308 కోట్లను విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రానికి రూ.1,847 కోట్లను 15వ ఆర్థిక సంఘం కేటాయించింది. ఆర్థిక  సంఘం నిధులలో జిల్లా, మండల పరిషత్‌లకు కూడా కేటాయించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. దీంతో, ఆర్థిక సంఘం నిధుల్లో జిల్లా పరిషత్‌లకు 5 శాతం, మండల పరిషత్‌లకు 10 శాతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది.


ఈ మేరకు తొలి విడత నిధుల్లో రూ.15.4 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.30.8 కోట్లు కేటాయిస్తారు. 85 ఽశాతం నిధులు రూ.261.8 కోట్లను గ్రామ పంచాయతీలకు కేటాయిస్తారు. ఆర్థిక సంఘం నిధుల విడుదలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తాగు నీటి, వాన నీటి సంరక్షణ పనులు, ఇంకుడు గుంతలు, సామాజిక మరుగు దొడ్లు, వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య పనులు, కంపోస్ట్‌ ఎరువుల తయారీ వంటివి చేపట్టవచ్చునన్నారు. 


Updated Date - 2020-08-15T09:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising