ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధిలోనూ ‘వావ్‌ వరంగల్‌’ అనిపిస్తా- ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-06-03T21:45:11+05:30

చారిత్రక, సాంస్కృతిక వైభవాల వరంగల్‌ నగరాన్ని మరింత అభివృద్ది చేసి ‘వావ్‌ వరంగల్‌’ అనిపిస్తానని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌: చారిత్రక, సాంస్కృతిక వైభవాల వరంగల్‌ నగరాన్ని మరింత అభివృద్ది చేసి ‘వావ్‌ వరంగల్‌’ అనిపిస్తానని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వరంగల్‌ అర్భన్‌జిల్లా, వరంగల్‌ పశ్చిమ  నియోజక వర్గ పరిధిలోని ఫాతిమాజంక్షన్‌లోహైదరాబాద్‌లోని టాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన లవ్‌ హైదరాబాద్‌ మాదిరిగానే వరంగల్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ రూపొందించిన వావ్‌ వరంగల్‌ను ప్రారంభించిన సందర్భంగా మం త్రి మాట్లాడుతూ వరంగల్‌ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఈ పురోగతిని చూసి ప్రతి ఒక్కరూ వావ్‌ వరంగల్‌ అనేలా రూపొందిస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని మిగిలిన నగరాలకు మోడల్‌గా రూపొందిస్తామన్నారు. అలాగే వరంగల్‌ అంటే ఓ చరిత్ర, వరంగల్‌ అంటే అభివృద్ధికి, గొప్ప సంస్కృతికి, గొలుసుకట్టుచెరువులకు, సహజ సిద్ధమైన రిజర్వాయర్లకు ఓ ఐకాన్‌గా నిలిచిందిందన్నారు. అదే ఒరవడిని కొనసాగిస్తూనే పూర్వవైభవాన్ని తీసుకు వస్తామని స్పష్టంచేశారు. పచ్చదనం, పరిశుభ్రత, అద్భుత కట్టడాలు, దేవాలయాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిలిచాయన్నారు. అలాంటి నగరానికి తాజాగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వావ్‌వరంగల్‌ ఆకర్షణీయమైనదని అన్నారు. 

Updated Date - 2020-06-03T21:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising