ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు- మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-05-24T20:12:29+05:30

రానున్న వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా రాష్ట్రంలో రెండుసార్లు విజయవంతమైన పల్లె ప్రగతి కార్యక్రమాన్నికొనసాగిస్తూనే కరోనా తరహాలో వచ్చే వ్యాధులను ఎదుర్కోవాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అధికారులను ఆదేశించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రానున్న వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా రాష్ట్రంలో రెండుసార్లు విజయవంతమైన పల్లె ప్రగతి కార్యక్రమాన్నికొనసాగిస్తూనే కరోనా తరహాలో వచ్చే వ్యాధులను ఎదుర్కోవాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యంతో పాటు నీరు నిల్వ ఉండేచోట్లను గుర్తించి నివారించాలని అన్నారు. మంచినీటిని పరిశుభ్రంగా, స్వచ్చంగా అందిచాలని అన్నారు. దోమలు పెరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచి సీఎం కేసీఆర్‌ కలలుగంటున్న గ్రామ స్వరాజ్యాన్ని సాధిద్దామని మంత్రి ఎర్రబెల్లి స్ధానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, అధికారులకు పిలుపునిచ్చారు. 


ఈ మేరకు అంతా కలిసికట్టుగా సీజనల్‌ వ్యాధులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఎట్టిపరిస్థితిలోనూ పారిశుద్ధ్యం వంటి అన్నికార్య్రకమాలపై అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిదులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రెండు విడతల పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజా ప్రతినిధులను , అధికారున  ఆయన అభినందించారు. పల్లె ప్రగతి విజయవంతం అయినందువల్లనే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నుంచి తెలంగాణ పలెల్లలను సురక్షితంగా ఉంచగలిగామన్నారు. ఇప్పుడు అదే పల్లె ప్రగతి స్పూర్తితో వచ్చే సీజనల్‌ వ్యాధులను అరికట్టాలని అన్నారు. దీనికి అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-05-24T20:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising