ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు:ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-11-26T20:58:24+05:30

మన పార్టీ.. మన అభివృద్ధి, మన సంక్షేమం అంటూ... ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుంటూ, ఓటర్ల ఇండ్లకు వెళ్లి, వారి పని పాటల్లో, ఆలోచనల్లో ఓ కుటుంబ సభ్యుడిగా కలిసి పోతున్నారు రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మన పార్టీ.. మన అభివృద్ధి, మన సంక్షేమం అంటూ... ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుంటూ, ఓటర్ల ఇండ్లకు వెళ్లి, వారి పని పాటల్లో, ఆలోచనల్లో ఓ కుటుంబ సభ్యుడిగా కలిసి పోతున్నారు రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా, మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలను అభ్యర్థి జెర్రి పోతుల ప్రభుదాస్ తో కలిసి మంత్రి కలియ తిరుగుతున్నారు. ఓటర్లను తనదైన వినూత్న శైలి లో ఆకట్టుకుంటున్నారు. డివిజన్ ప్రజలు కూడా మంత్రిని అంత కంతా ఆదరిస్తున్నారు. అంతేకాక ఓటర్ల తో కలిసి ఫోటోలు, సెల్ఫీ లు దిగుతున్నారు. పిల్లా,పాపలతో, ఇంటిల్లిపాది ఆయనతో ఫోటోలు దిగడానికి ఉత్సాహ పడుతున్నారు.


కొందరు చేసే పనులలో మంత్రి కాసేపు ఆటవిడుపు గా ఆయా పనులు చేస్తున్నారు.గురువారం మంత్రి మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లోని వెంకేటేశ్వర నగర్ కాలనీ, డైమండ్ హిల్స్ కాలనీ,హౌసింగ్ బోర్డు ఫేస్ 2 తదితర ప్రాంతాల్లో అభ్యర్థి తో కలిసి విస్తృత ప్రచారం చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తు టీఆర్ఎస్ కే ఎందుకు ఓటు వేయాలో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.అలాగే మన గల్లీలకు ఢిల్లీ పార్టీలు అవసరమా అని ప్రశ్నించారు.


మన పార్టీ మన సంక్షేమం మన అభివృద్ధి ని చూడాలన్నారు. బీజేపీ తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. మనం కేంద్రానికి రూపాయి ఇస్తే అందులో పావలా కూడా మనకు ఇవ్వడం లేదన్నారు.కాంగ్రెస్ కు దిక్కు లేదన్నారు.మన ప్రాంతంలో అభివృద్ధి,హైదరాబాద్ నగరం విశ్వ నగరం కావాలన్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు.

Updated Date - 2020-11-26T20:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising