పన్నులు కట్టండి... పల్లెల ప్రగతికి పాటుపడండి
ABN, First Publish Date - 2020-10-03T19:25:14+05:30
పర్వతగిరి లోని తన నివాసానికి ఇంటి పన్ను, నల్లా పన్ను కట్టిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
వరంగల్: పర్వతగిరి లోని తన నివాసానికి ఇంటి పన్ను, నల్లా పన్ను కట్టిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. శనివారం రోజు పర్వతగిరిలోని తన నివాసానికి సంబంధించిన ఇంటి పన్ను, నల్లా పన్నులను 5,220 రూపాయలను గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితర అధికారులకు కట్టి రశీదు తీసుకున్నారు. పన్నులను కట్టి రాష్ట్రానికి మంత్రి అయినా, తన ఊరు లో మాత్రం సామాన్యుడినేనని నిరూపించారు. పన్నులు చెల్లించి, పల్లెల ప్రగతికి పాటుపడండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. సగటు పౌరులు పన్నులు కట్టి బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యంపివో మధుసూదన్, సోమేశ్వర్ రావు, సంపత్, పంచాయితీ సెక్రటరీ రమేశ్, వార్డు సభ్యుడు యాకాంతం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-03T19:25:14+05:30 IST