ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యులు, ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారు- ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-08-04T20:01:45+05:30

జిల్లాలో కోవిడ్‌బాధితులకు వైద్యులు, ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌: జిల్లాలో కోవిడ్‌బాధితులకు వైద్యులు, ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. ఎంజిఎం హాస్పిటల్‌లో ఇప్పుడున్న కోవిడ్‌ వార్డుతో పాటు అదనంగా మరో 200 పడకలను ఏర్పాటుచేయబోతున్నామని చెప్పారు. కరోనా సోకిన వారికి మరింత మెరుగైన వైద్యసేవలు అందించి ఎంజిఎంలో సమస్యలు చక్కదిద్దేందుకు ప్రజా ప్రతినిధులు నడుం బిగించారు. ఈసందర్భంగా కేఎంసి ఆవరణలో పీఎంఎస్‌ఎస్‌వై నిధులతో నూతనంగా నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రజా ప్రతినిధులతో సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 250 పడకలు గల ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం కోవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందించేందుకు 120 బెడ్‌లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 


కరోనా సమస్యను రాజకీయం చేయొద్దని, అబద్దాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు. మాజీ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రావు కేవలం ఆరోగ్యం బాగాలేక పోవడం, ఆయన కుటుంబ సభ్యులు అంతా కరోనా బారిన పడడం వల్లే ఆయన రాజీనామా చేశారని అన్నారు. ఆ రాజీనామాను రాజకీయం చేయవద్దని విజ్ఞప్తిచేశారు. కరోనా రోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రజలు కరోనా బాధితులను శత్రవులుగా, అంటరాని వారిగా చూడడం సరికాదన్నారు.


ఎంజిఎంలో ప్రతి కరోనా పేషెంట్‌ ప్రాణాలుకాపాడడమే లక్ష్యంగా వైద్యులు శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా సేవలు అందించేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు. స్వచ్చంద సంస్థలు, వాలంటీర్లు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వెంట ప్రభుత్వచీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, కలెక్టర్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-08-04T20:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising