ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలు నాటి ఎర్రబెల్లి గార్డెన్‌గా నామకరణం

ABN, First Publish Date - 2020-07-04T23:58:50+05:30

రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పుట్టిన రోజు వేడుకలను పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు తన నియోజక వర్గంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకుర్తి: రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పుట్టిన రోజు వేడుకలను పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు తన నియోజక వర్గంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుతున్నారు. వల్మీడి గ్రామంలో హ్యాపీబర్త్‌డే దయన్న పేరుతో నాగలి దున్ని జరపగా, పెద్ద వంగర మండలంలో చెలకల్లో, చేలల్లోరైతులు కేసీఆర్‌, దయన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వేడుకలు చేశారు. కాగా పాలకుర్తి మండలం తీగారం గ్రామ పంచాయితీ, స్టూడెంట్‌ ఫర్‌ సేవ, మార్గం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వెరైటీగా జరిపారు. చెరువు శిఖంలో ఉన్న 10గుంటల భూమిలో 300లకు పైగా రక రకాల మొక్కలు నాటారు. అందులోనే ఈడీఆర్‌ అనే ఆంగ్ల అక్షరాలు రాసి ఆ వరుసలో మొక్కలను నాటారు. 


అంతటితో ఆగకుండా ఆస్థలానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జన్మదిన గుర్తుగా ఈడీఆర్‌గార్డెన్‌గా నామకరణం చేశారు. ఆ గార్డెన్‌ రక్షణ, అందులోని మొక్కల రక్షణ బాధ్యతలను గ్రామపంచాయితీ స్టూడెంట్‌ ఫర్‌ సేవ , మార్గం ఫౌండేషన్‌లు తీసుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ పొగురాజేశ్వరీ శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ మొగుళ్ల కుమార్‌, ఎంపిటీసీ బెల్లి పోమయ్య, సాయిసందీప్‌తేజ తదితరులు నాయకత్వం వహించారు.

Updated Date - 2020-07-04T23:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising