ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమర్శించడం విపక్షాలకు ఫ్యాషన్‌: మల్లారెడ్డి

ABN, First Publish Date - 2020-07-11T08:47:36+05:30

ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని విమర్శించడం, వ్యాఖ్యలను వక్రీకరించడం విపక్షాలకు ఫ్యాషన్‌గా మారిందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని విమర్శించడం, వ్యాఖ్యలను వక్రీకరించడం విపక్షాలకు ఫ్యాషన్‌గా మారిందని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను విమర్శించడాన్ని తప్పుపట్టారు. కరోనా మహమ్మారిపై సర్కారు చేపట్టిన కార్యక్రమాలకు సహకరించాల్సింది పోయి.. అనవసర విమర్శలు చే స్తున్నారని మండిపడ్డారు.


విపక్షాలు ప్రజలను మభ్యపెట్టే పద్ధతిని మానుకోవాలని హితవు పలికారు. కరోనాపై కొందరు ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయన్నారు. చెట్లు పర్యావరణానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తాయని, భూతాపాన్ని, కాలుష్యాన్ని తగ్గించి, ప్రజలను వ్యాధుల బారి నుంచి కాపాడతాయనే ఉద్దేశంతో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తమకు ఇష్టం వచ్చిన పద్ధతిలో అన్వయించుకోవడం సరికాదని మల్లారెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2020-07-11T08:47:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising