ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిల్లర్ల జేబులు నింపేందుకే కోతలు

ABN, First Publish Date - 2020-05-20T09:39:56+05:30

కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కువ తూకం వేస్తూ మళ్లీ మిల్లుల్లో దిగుమతి అయ్యాక కోత విధిస్తూ మిల్లర్ల జేబులు నింపడానికే ప్రభుత్వం పని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి


వర్ధన్నపేట, మే 19 : కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కువ తూకం వేస్తూ మళ్లీ మిల్లుల్లో దిగుమతి అయ్యాక కోత విధిస్తూ మిల్లర్ల జేబులు నింపడానికే ప్రభుత్వం పని చేస్తోందని కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఇల్లందలో వర్ధన్నపేట పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాయకులు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, నమిండ్ల శ్రీనివాస్‌, బొంపెల్లి దేవేందర్‌రావు, వెంకట్రామిరెడ్డిలో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ తాలు పేరుతో 2 కిలోల వరకు అదనంగా తూకం వేసుకోవడంతోపాటు మిల్లుకు చేరగానే మళ్లీ కిలోకుపైగా 40కిలోల బస్తాకు కోత విధిస్తున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు నరుకుడు వెంకటయ్య, ఎర్ర శ్రవణ్‌కుమార్‌, పోశాల వెంకన్న, గుంటి కుమారస్వామి, మల్లెపాక సమ్మయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-05-20T09:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising