ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణీకులకు మెట్రో అధికారుల ఆరోగ్యపాఠాలు

ABN, First Publish Date - 2020-02-22T20:50:44+05:30

నడక ఆరోగ్యానికి మంచిది అంటూ డాక్టర్లుచెప్తున్నారు. దీనిని ఎంతో మందిపాటిస్తూనే ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నడక ఆరోగ్యానికి మంచిది అంటూ డాక్టర్లుచెప్తున్నారు. దీనిని ఎంతో మందిపాటిస్తూనే ఉన్నారు.అయితే హైదరాబాద్‌ మెట్రో అధికారులు సైతం ఇదే సూత్రాన్ని ప్రయాణీకులకు ఉద్బోధిస్తున్నారు. అయితే ఇందులో రెండు రకాల ప్రయోజాలను హెచ్‌ఎంఆర్‌ ఆశిస్తున్నారు. ఒకటి మెట్లుఎక్కడం ద్వారా కేలరీలు ఖర్చయి ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు. అలాగే ఇటీవల కాలంలో అధికశాతం మంది మెట్రో స్టేషన్‌లలో మెట్లకంటే లిఫ్ట్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనిని తగ్గించి మెట్లదారిని కూడా అలవాటు చేయాలన్న లక్ష్యంతో మెట్లపై ఆరోగ్య సూత్రాలను వల్లిస్తున్నారు. మెట్లు ఎక్కడం ద్వారా ఎన్నిక్యాలరీలు ఖర్చవుతాయన్న విషయాన్ని తెలియజేస్తూ ఒక్కోమెట్లుకు ఎన్ని క్యాలరీలు ఖర్చవుతాయో వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. నగరంలోని రాయదుర్గ స్టేషన్‌లలో ఈ రకమైన ప్రచారాన్ని ప్రారంభించినట్టు మెట్రో అధికారులు తెలిపారు. ఈ కొత్త ప్రచారాన్ని ప్రయాణీకులకు కూడా ఆసక్తిని కలిగిస్తోంది. దీంతో చాలా మంది మెట్లను వినియోగిస్తున్నారు. తాము అనుకున్నట్టుగా మంచి స్పందన వస్తుండడంతో త్వరలో మరిన్నిస్టేషన్‌లలో ఇలాంటి ప్రచారాన్ని నిర్వహించి, లిఫ్ట్‌లపై భారాన్నితగ్గించుకుంటామని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-02-22T20:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising