మెట్రో రెండో దశలో కదలిక
ABN, First Publish Date - 2020-11-03T08:01:48+05:30
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అధ్యక్షతన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డుల
కీలకమైన మార్గాలను పరిశీలించేందుకు నిపుణులతో కమిటీ
ఐదేళ్లపాటు మెట్రో సేవల అధ్యయనం
స్వతంత్ర ఇంజనీరింగ్ సంస్థ ఎంపిక
రూ.6.94 కోట్లు ఇచ్చేందుకు బోర్డు అమోదం
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అధ్యక్షతన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డుల సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రెండో దశలో చేపట్టే మార్గాలను పరిశీలించేందుకు ప్రభు త్వ ఉన్నత స్థాయి అధికారులతో కమిటీని నియమించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, ట్రాన్స్‌పోర్టు, ఆర్ అండ్ డీ, ఫైనాన్స్‌లకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఈ కమిటీలో ఉన్నారు.
మెట్రో రెండో దశ విస్తరణ ప్రణాళికతోపాటు కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ వరకు 18 కిలోమీటర్ల మేర నిర్మించే ఈబీఆర్‌టీఎస్ (ఎలివేటెడ్ బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. ఈ బృందం మెట్రో ఫేజ్-2తో పాటు ఈబీఆర్‌టీఎస్ కారిడార్లు, ఓఆర్‌ఆర్, మూసీ రివర్ ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా కీలకమైన ట్రాఫిక్ కారిడార్లను పరిశీలించి, దాని పరిష్కారానికి సమగ్రమైన రవాణా వ్యవస్థలను రూపొందించనున్నారు.
కాగా సమావేశంలో భాగంగా మెట్రో రైలు పునఃప్రారంభం, తీసుకుంటున్న జాగ్రత్తలు, భద్రత, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించడానికి తీసుకున్న చర్యలు వంటి అంశాలపై సమీక్షించారు. మెట్రో సేవలను ఐదేళ్లపాటు అధ్యయనం చేసేందుకు స్వతంత్ర ఇంజనీరింగ్ సంస్థ ఎకామ్ ఇండియాను ఎంపిక చేశారు. ఈ సంస్థ కార్యకలాపాలకు రూ.6.94 కోట్లు ఇచ్చేందుకు బోర్డు అమోదం తెలిపింది.
Updated Date - 2020-11-03T08:01:48+05:30 IST