ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ-సేవ నిర్వాహకుల ఖాతాల్లో రూ.40 లక్షలు!

ABN, First Publish Date - 2020-11-22T09:34:28+05:30

కల్యాణలక్ష్మి నిధుల దుర్వినియోగంపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ అకౌంట్ల నుంచే అధికారులకు  నగదు బదిలీ


ఆదిలాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కల్యాణలక్ష్మి నిధుల దుర్వినియోగంపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో రూ.కోట్లలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇచ్చోడ, సిరికొండ మండలాలకు చెందిన మీ- సేవ కేంద్రం నిర్వాహకులు ఓ హత్యానేరం కింద జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు షిందే అచ్యుత్‌, జాదవ్‌ శ్రీనివా్‌సలను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించగా కల్యాణలక్ష్మి కుంభకోణంలో రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు వెలుగుచూసింది. దీంతో జిల్లా అంతటా రెవెన్యూ అధికారుల పాత్రపై ఏసీబీ, పోలీసులు ఆరా తీస్తున్నారు.


కాగా ఓ డివిజన్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు తహసీల్దార్లు, నలుగురు ఆర్‌ఐలకు మీ- సేవ నిర్వాహకులు.. బ్యాంకు ఖాతాల నుంచే నగదును బదిలీ చేసినట్లు తెలిసింది. అచ్యుత్‌, శ్రీనివా్‌సలకు ఆదిలాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతాలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ.. వారి ఖాతాలను సీజ్‌ చేసింది. ప్రస్తుతం వారిద్దరి బ్యాంకు ఖాతాల్లో రూ.40లక్షలు ఉన్నట్లు సమాచారం. షిందే అచ్యుత్‌, జాదవ్‌ శ్రీనివా్‌సలను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-11-22T09:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising