ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా సంఘాలకు ‘సీఏ’ల బెడద

ABN, First Publish Date - 2020-07-08T11:44:20+05:30

ఇంటి అవసరాలకు కొందరు, ఆపదలో అక్కరకు వస్తాయని మరికొందరు ఇలా ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులు రుణాల కోసం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి లోన్‌లోనూ కమీషన్‌ కోసం డిమాండ్లు 

కొవిడ్‌-19 రుణాల్లోనూ రూ.50 చొప్పున వసూలు 

అడిగితే మరోసారి అప్పులు మంజూరు కాకుండా ఇబ్బందులు 


సిద్దిపేట సిటీ, జూలై 7: ఇంటి అవసరాలకు కొందరు, ఆపదలో అక్కరకు వస్తాయని మరికొందరు ఇలా ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులు రుణాల కోసం అప్లయ్‌ చేసుకుంటే వచ్చే కొద్దిపాటి లోన్‌లో సీఏలు (గ్రామసంఘం సహాయకులు) కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. జలగల్లా వారిని పీడిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇస్తున్న కొవిడ్‌-19 రుణాల్లోనూ కమీషన్ల కోసం మహిళా సంఘాలను ఇబ్బందులకు గుర్తిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.


సిద్దిపేట జిల్లాలో రూరల్‌, అర్భన్‌తో కలిపి మొత్తం 23 మండలాల్లోని 719 గ్రామపంచాయతీల్లో 1,83,785 మహిళా సంఘాల గ్రూపులున్నాయి. ఆయా మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి స్త్రీ నిఽధి, వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కొవిడ్‌-19లోన్లు మంజూరవుతున్నాయి. అయితే మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పినా అవి నీటిమూటగానే మిగిలాయి. ఏడాదిగా ఈ రుణాల వడ్డీభారం మహిళా సంఘాలపై పడుతూనే ఉంది. 


దీనికి తోడు కొందరు సీఏలు ప్రతి లోన్‌లోనూ కమీషన్లు ఆశిస్తున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో పనులు లేక ఆదాయం తగ్గి సభ్యులు నెలనెలా కిస్తీ కట్టే పరిస్థితి లేదు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు కొవిడ్‌-19 పేరిట ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున రుణంగా ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతి గ్రూపు నుంచి సభ్యుల పాస్‌బుక్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌ తీసుకుని రుణాలు మంజూరు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 15,574 గ్రూపులకు ఈ పథకం ద్వారా రుణాలు ఇవాల్సి ఉంది. అయితే ఇప్పటికే 7,667 గ్రూపులకు అప్పులు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రూ.46.17 కోట్ల చెల్లింపులు చేశారు. 


ప్రతి రుణంలోనూ కమీషన్‌

మహిళా సంఘాలకు అప్పు ఇప్పించే సీఏలు కమీషన్లకు ఆశపడి అందినకాడికి దండుకుంటున్నారు.  వడ్డీలేని రుణం మంజూరు చేయడానికి ప్రతి గ్రూపు నుంచి రూ.2వేలు తీసుకుంటున్నారని మహిళా సంఘాల సభ్యులు వాపోతున్నాయి.  కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొవిడ్‌-19లోన్ల మంజూరులోనూ ఒక్కో మహిళ వద్ద రూ.50 వసూలు చేస్తున్నారని ఆయా గ్రూపు సభ్యులు చెబుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర రూ.50 అంటే ఒక్కో గ్రూపులో 12మంది ఉంటారు.  ఒక గ్రామంలో 20 గ్రూపుల వరకు ఉంటాయి. ఈ లెక్కన సీఏలు ఒక ఊరిలో ద్వారా దాదాపు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారు. కమీషన్‌ ఇస్తేనే పూర్తిస్థాయిలో రుణం మంజూరయ్యేలా చూస్తామని, లేదంటే మరోసారి రుణాల మంజూరులో ఇబ్బందులు తలెత్తుతాయంటూ బెదిరిస్తున్నారని పలు మహిళా సంఘాల సభ్యులు వాపోతున్నారు. 

Updated Date - 2020-07-08T11:44:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising