ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి విస్తృత చర్యలు చేపడుతున్నాం

ABN, First Publish Date - 2020-08-07T07:06:51+05:30

కరోనా కట్టడికి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతున్నదని, ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల 


మెదక్‌  అర్బన్‌/సంగారెడ్డి టౌన్‌, ఆగస్టు 6 : కరోనా కట్టడికి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతున్నదని, ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి మెదక్‌, సంగారెడ్డి కలెక్టర్లు, వైద్యాధికారులతో సీఎస్‌ సోమే్‌షకుమార్‌తో కలిసి కరోనాపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో కరోనా వ్యాధిగ్రస్థులకు కల్పించే వసతులు, పడకల ఏర్పాటు, చికిత్స ఏవిధంగా ఉందనేదానిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదన్నారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ నగేష్‌, డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటేశ్వర్‌రావు, జిల్లా సర్వేలైన్‌ అధికారి నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు. కరోనాపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటల అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో కరోనా బాధితులకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ హన్మంతరావు తెలిపారు. పది వెంటిలేటర్లను అందుబాటులో ఉంచామని, ఎంఎన్‌ఆర్‌ ఆస్పత్రిలో 100 పడకల వార్డును ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, ఎల్‌డీఎం మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-07T07:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising