ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే తీరు అప్రజాస్వామికం

ABN, First Publish Date - 2020-12-11T06:24:30+05:30

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని టీయూడబ్ల్యూజే రాష్ట్రప్రధాన కార్యదర్శి విరాహత్‌అలీ విమర్శించారు.

రాస్తారోకోలో పాల్గొన్న టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌అలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాస్తారోకో


పటాన్‌చెరు, డిసెంబరు 10: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని టీయూడబ్ల్యూజే రాష్ట్రప్రధాన కార్యదర్శి విరాహత్‌అలీ విమర్శించారు. జర్నలిస్టును దుర్భాషలాడిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం పటాన్‌చెరులో నిర్వహించిన రాస్తారోకోకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలాంటి పాత్రికేయులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. చట్టసభల్లో శాసనాలు చేసే ఎమ్మెల్యేలే పాత్రికేయులపై దౌర్జన్యానికి దిగితే వారు చేసిన ప్రమాణస్వీకారానికి అర్థం లేదన్నారు. వార్తల్లో అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప దౌర్జన్యానికి తావులేదన్నారు. పాత్రికేయలోకానికి ఎమ్మెల్యే తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో జర్నలిస్ట్‌ సంఘ రాష్ట్ర నాయకులు ఫైసల్‌, ఏ.రాజేశ్‌, శ్రీనివా్‌సశర్మ, మిన్పూర్‌శ్రీనివాస్‌, శంకర్‌దయాల్‌చారి, శ్రీకాంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T06:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising