ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడ్రోజుల్లో బియ్యం పంపిణీ: అదనపు కలెక్టర్‌ నగేశ్‌

ABN, First Publish Date - 2020-03-25T13:10:46+05:30

చేర్యాలలో మంగళవారం కొనసాగాల్సిన వారాంతపుసంత రద్దవడంతో ఉగాది పండగ సందర్భంగా కూరగాయలు, మట్టికుండలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలుకు జనాలు ఒక్కొక్కరిగా దుకాణాల వద్దకు చేరుకున్నారు. రద్దీ ఎక్కువవుతున్న విషయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ రూరల్‌, మార్చి 24: సివిల్‌ సప్లయ్స్‌ గోదాముల నుంచి మూడ్రోజుల్లో బియ్యం సరఫరా చేయాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సివిల్‌ సప్లయ్స్‌ స్టేజ్‌-1, స్టేజ్‌ -2 కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల బదులు 12 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 35 కిలోల లబ్ధిదారుడి ఇంట్లో ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఇవ్వాలన్నారు. అన్నపూర్ణ లబ్ధిదారులకు కూడా 10 కిలోలకు బదులుగా 12 కిలోలు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. చౌక ధరల దుకాణంలో స్థలం లేకుంటే హస్టల్స్‌, స్కూల్స్‌, పంచాయతీ భవనాల్లో బియ్యం నిల్వ చేసుకోవాలన్నారు.


ప్రతి లబ్ధిదారుడు క్యూలో సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. బియ్యం పంపిణీ అనంతరం గన్నీ బ్యాగులను సత్వరమే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు పంపాలన్నారు. స్టేజ్‌-1, స్టేజ్‌-2 ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని అందరూ కలిసి ఎలాంటి ఆటంకం లేకుండా మూడ్రోజుల్లో షాపులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ రాజునాయక్‌, డిప్యూటీ తహసీల్దార్‌ సాధిక్‌ హుస్సేన్‌, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జితో పాటు కాంట్ర్టార్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-25T13:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising