ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని, రైతులను తప్పుదోవ పట్టించేలా వ్యవసాయ బిల్లు

ABN, First Publish Date - 2020-10-03T10:14:34+05:30

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులను, దేశాన్ని తప్పుదోవ పట్టించేలా ఉందని కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి 


సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు2: కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులను, దేశాన్ని తప్పుదోవ పట్టించేలా ఉందని కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆరోపించారు. శుక్రవారం సిద్దిపేటలోని గాంధీచౌరస్తా వద్ద గాంధీవిగ్రహనికి పూలమాలలు వేసిన అనంతరం ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద రైతు వ్యతిరేక బిల్లుపై చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూంకుంట నర్సారెడ్డి మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు చేకూర్చేలా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కిసాన్‌సెల్‌ ఉపాధ్యక్షుడు కొదండరెడ్డి, నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌, నర్సారెడ్డి, గంప మహేందర్‌, ప్రభాకర్‌వర్మ, బొమ్మలయాదగిరి, బాలకృష్ణరెడ్డి, దేవులపల్లి యాదగిరి, ముద్దం లక్ష్మి, సమీర్‌, రవీందర్‌రెడ్డి,  సతీష్‌, వహీద్‌ఖాన్‌, కలీమొద్దిన్‌ పాల్గొన్నారు.


రాహుల్‌గాంధీపై దాడి పిరికిపంద చర్య

ఉత్తరప్రదేశ్‌లో దళిత యువతి మనీషాపై జరిగిన అత్యాచారం, హత్యపై ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు వెళ్తుంటే మార్గంమధ్యలో పోలీసులతో సీఎం యోగి దాడి చేయించడం పిరికిపంద చర్యగా భావిస్తున్నామని టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతర ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలనలో మహిళలపై దాడులు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు కమర్‌ పాషా, యువజన కాంగ్రెస్‌ నాయకులు వాహబ్‌, సీతబాలు, వంశీ, పవన్‌, తదితరులు పాల్గొన్నారు.


చేర్యాల, కొమురవెల్లిలో కాంగ్రెస్‌ ధర్నా

చేర్యాల, అక్టోబరు 2 : కేంద్రం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం కొమురవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలోని గాంధీ చౌక్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ చేపట్టారు. అనంతరం యూత్‌కాంగ్రె్‌స మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడారు. అనంతరం తహల్దార్‌ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందించారు. ధర్నాలో నాయకులు లింగంపల్లి కనకరాజు, ఎంఆర్‌. మల్లేశం, మకిలి కనకయ్య, గీస రాజయ్య, బుడిగె అయిలేని, ముత్యం కర్ణాకర్‌, ప్రవీణ్‌, పుట్ట రమేశ్‌, మల్లం బాలయ్య తదితరులు పాల్గొన్నారు.


వ్యవసాయ బిల్లును నిరసిస్తూ శుక్రవారం చేర్యాలలోనూ కాంగ్రెస్‌ నాయకులు స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్‌, మంచాల చిరంజీవులు, సుంకరి శ్రీధర్‌, కొమ్ము రవి, ముస్త్యాల యాదగిరి,ఉడుముల భాస్కర్‌రెడ్డి, జానకి స్వామి, కాటం శ్రీను, గుస్క కృష్ణ, తాటిపాముల శ్రీనివాస్‌, వెలగల దుర్గయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T10:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising