ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరాశ్రయులకు ఇంటిని నిర్మించి ఇచ్చిన మంత్రి

ABN, First Publish Date - 2020-12-20T05:19:59+05:30

నిరాశ్రులయిన ఆడబిడ్డలకు మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మతో గృహప్రవేశ వేడుకలో రిబ్బెన్‌ను కట్‌ చేయిస్తున్న మంత్రి హరీశ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నకోడూరు, డిసెంబరు 19: నిరాశ్రులయిన ఆడబిడ్డలకు మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. మండలంలోని రామంచ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దొంతరబోయిన బాలమణి భర్త మరణించాడు. కూతురు స్రవంతితో పెంకుటింటిలో ఉండేది. ఆ ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. స్రవంతి మేకలు, బర్లను కాపు కాస్తు ఇంటిని నెట్టుకొస్తున్న విషయం తెలసుకున్న మంత్రి హరీశ్‌రావు ఆర్థిక సహాయం అందించి, ఇట్టి నిర్మాణం చేపట్టారు. శనివారం గృహ ప్రవేశ వేడుకలో మంత్రి పాల్గొన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మతో రిబ్బెన్‌ కట్‌ చేయించారు. ఆనతరం తల్లీకూతుళ్లకు నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ కాముని శ్రీనివాస్‌, సర్పంచ్‌ సంతోషివిక్రమాదిత్య, ఎంపీటీసీ ఎడ్ల వెంకటలక్ష్మియాదవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో పలువురి కుటుంబాలను మంత్రి పరామర్శించారు. 


Updated Date - 2020-12-20T05:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising