ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ పతనం మొదలైంది

ABN, First Publish Date - 2020-12-11T05:50:51+05:30

టీఆర్‌ఎస్‌ పతనం మొదలైంది

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్‌ జాగృతి విభాగం జిల్లా అధ్యక్షుడు కమలాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి

హత్నూర, డిసెంబరు 10 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పతనం మొదలైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బోర్పట్ల గ్రామానికి చెందిన తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గునుకుంట్ల కమలాకర్‌ తన అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నరేందర్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధానాలను అవలంభించడంతో పాటు ప్రజాగ్రహానికి గురవుతున్నదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రఘువీరారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహేష్‌, బీజేపీ మండల అధ్యక్షుడు నాగప్రభుగౌడ్‌ ప్రధాన కార్యదర్శి హన్మంత్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T05:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising