ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిబ్రవరి 15లోపు డిపో సిద్ధం చేయాలి

ABN, First Publish Date - 2020-12-14T04:38:07+05:30

నర్సాపూర్‌, డిసెంబరు 13 : నర్సాపూర్‌లో నిర్మిస్తున్న ఆర్టీసీ డిపోను ఫిబ్రవరి 15లోపు సిద్ధం చేయాలని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పురుషోత్తంనాయక్‌ కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు.

నర్సాపూర్‌ ఆర్టీసీ డిపో పనులను పరిశీలిస్తున్న పురుషోత్తంనాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంట్రాక్టర్‌కు ఆర్టీసీ ఈడీ పురుషోత్తం ఆదేశాలు 

నర్సాపూర్‌, డిసెంబరు 13 : నర్సాపూర్‌లో నిర్మిస్తున్న ఆర్టీసీ డిపోను ఫిబ్రవరి 15లోపు సిద్ధం చేయాలని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పురుషోత్తంనాయక్‌ కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. ఆదివారం నర్సాపూర్‌లోని ఆర్టీసీ డిపో పనులతో పాటు బస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్‌ పనులు త్వరితగతిన పూర్తిచేస్తూ నాణ్యత విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించొద్దని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీఈఈ ఏవీరావుకు సూచించారు. పనులకు సంబంధించిన నిధులను కూడా త్వరితగతిన ఇప్పిస్తామని హామీనిచ్చారు. రెండురోజుల క్రితం మంత్రి హరీశ్‌రావు నర్సాపూర్‌లో ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించి డిపోను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఉన్నతాధికారులు పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ డిపో మేనేజర్‌ జాకీర్‌హుస్సేన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T04:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising