ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సన్నాలను కొంటేనే కేంద్రాన్ని తెరవాలి

ABN, First Publish Date - 2020-11-21T06:08:51+05:30

సన్న వడ్లను కొనాలని లేదంటే కొనుగోలు కేంద్రాన్ని తెరువొద్దని డిమాండ్‌ చేస్తూ మండలంలోని లింగాపూర్‌ గ్రామ రైతులు శుక్రవారం కొనుగోళ్లను నిలిపివేశారు.

ఖేడ్‌ మండలం లింగాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగాపూర్‌లో రైతుల నిరసన


నారాయణఖేడ్‌, నవంబరు 20: సన్న వడ్లను కొనాలని లేదంటే కొనుగోలు కేంద్రాన్ని తెరువొద్దని డిమాండ్‌ చేస్తూ మండలంలోని లింగాపూర్‌ గ్రామ రైతులు శుక్రవారం కొనుగోళ్లను నిలిపివేశారు. లింగాపూర్‌ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొందరు రైతుల వడ్లు కొనుగోలు చేశాక మిగిలిన రైతులవి కొనడం ఆపేశారు. దీంతో శక్రవారం కొనుగోళ్లను అడ్డుకున్నారు. అధికారులు చెప్పడంతోనే గ్రామంలో 150 మంది రైతులు 300 ఎకరాల వరకు సన్న రకం వడ్లను సాగు చేశారు. కేవలం 20 ఎకరాల్లోపే దొడ్డురకం వడ్లను సాగు చేశారు. సన్నరకం సాగుతో దిగుబడి తగ్గిందని, కొనుగోళ్లు కూడా చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సన్నవడ్లను చెన్నీ (జల్లెడ) పట్టి తీసుకొస్తే ఏ గ్రేడ్‌  రకంగా కొంటామని, ప్రస్తుతం కొనుగోళ్లు నిలిచి పోయాయని కేంద్రం ఇన్‌చార్జి సుందర్‌లాల్‌ తెలిపారు. 

Updated Date - 2020-11-21T06:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising