ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తజనమయం

ABN, First Publish Date - 2020-12-28T04:59:34+05:30

చేర్యాల, డిసెంబరు 27: ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం భక్తజనమైంది.

కొమురవెల్లి మల్లన్న ఆలయంలోని గంగిరేగు చెట్టు ప్రాంగణంలో పట్నం వేసి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, డిసెంబరు 27: ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం భక్తజనమైంది. మరికొద్దిరోజుల్లో  స్వామివారి కల్యాణం జరగనున్న నేపథ్యం లో గర్భాలయాన్ని సుందరీకరించనున్నందున మూలవిరాట్టు దర్శనాన్ని నిలిపివేయనుండంతో పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు మలన్నను దర్శించుకుని గంగిరేగుచెట్టు ప్రాంగణంలో నజరు, బసచేసిన ప్రదేశంలో చెలకపట్నాలు రచించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు నిర్వహించిన ఆర్జితసేవలు, వసతిగదుల అద్దె, పట్నాలు, బోనాలు, ప్రసాద విక్రయాలు, ప్రత్యేక దర్శనాలు, ఇతరాల ద్వారా సుమారు రూ.3లక్షల మేర ఆదాయం సమకూరినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇన్‌చార్జి ఈవో బాలాజీ ఆఽధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు.  

కన్నుల పండువగా  రేణుకా ఎల్లమ్మ విగ్రహ  ప్రతిష్ట

చేర్యాల మండలం వీరన్నపేటలో రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టను ఘనంగా నిర్వహించారు. వేడుకలసందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి కుటుంబసభ్యులు తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొన్నది. కార్యక్రమంలో సర్పంచు కొండపాక భిక్షపతి, మాజీ సర్పంచు వల్లూరి శ్రీనివాస్‌, స్థానికులు పాల్గొన్నారు.

పెద్దమ్మ ఆలయంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు పూజలు

దుబ్బాక,డిసెంబరు27: దుబ్బాక మున్సిపాలిటీలోని చేర్వాపూర్‌ వార్డులో ఆదివారం శ్రీపెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్‌ స్వప్న, ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు రోశయ్య, బాలే్‌షగౌడ్‌, వెంకట్‌రెడ్డి, రాజిరెడ్డి, బద్రి, ప్రవీన్‌, సప్తగిరి, వెంకట్‌, రవీందర్‌, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T04:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising