ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగూరు నీటితో చెరువులను నింపుతాం

ABN, First Publish Date - 2020-12-11T05:40:14+05:30

జోగిపేట, డిసెంబరు 10 : వారం పదిరోజుల్లో అందోలు, పుల్కల్‌ మండలాల్లోని అన్ని చెరువులనూ సింగూరు నీటితో నింపుతామని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ప్రకటించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతుల వెన్ను విరిచే నూతన సాగుచట్టాన్ని వ్యతిరేకించాల్సిందే

అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

జోగిపేట, డిసెంబరు 10 : వారం పదిరోజుల్లో అందోలు, పుల్కల్‌ మండలాల్లోని అన్ని చెరువులనూ సింగూరు నీటితో నింపుతామని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ప్రకటించారు. గురువారం జోగిపేటలో ఎంపీపీ అధ్యక్షుడు జోగు బాలయ్య అధ్యక్షతన అందోలు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే పుల్కల్‌ మండలంలోని మెజార్టీ చెరువులు నిండాయని, త్వరలోనే మిగతావి పూర్తిచేసి, ఆ తర్వాత అందోలు మండలంలోని చెరువులను నింపుతామన్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మరో పదిరోజుల సమయం పడుతుందని చెప్పారు. రెండు మండలాల్లోని అన్ని చెరువులూ, కుంటలూ గొలుసు కట్టు కాలువల ద్వారా అనుసంధానించబడి ఉండడం ఈ ప్రాంతం రైతుల అదృష్టమంటూ, ఆటోమేటిక్‌గా ఒకదాని తర్వాత మరో చెరువు నిండుతుందన్నారు. ఏవైనా చెరువులు, కుంటల్లోకి నీళ్లు రాకపోతే ఇరిగేషన్‌ అధికారులకు తెలపాలని, వారు కూడా స్పందించకపోతే తనకు సమాచారమందించాలని ఎమ్మెల్యే చెప్పారు. చెరువులు, కుంటలు నింపేటప్పుడు ఇప్పటికే అందులోని శిఖం భూముల్లో ఏమైనా పంటలు వేశారా.. అన్న సంగతిని తెలుసుకోవాలన్నారు. ఒకవేళ పంట వేస్తే వాటిని కోసేదాకా ఆగి నీటిని నింపాలని తెలిపారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన సాగుచట్టం రైతుల వెన్ను విరిచేదిగా ఉన్నదని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అభిప్రాయపడ్డారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించాల్సిందేనని ప్రజాప్రనిధులకు సూచించగా.. ఎమ్మెల్యే ప్రతిపాదనను మండల సర్వసభ్య సమావేశం వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతకు ముందు తమ గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలపై ఎంపీటీసీలు, సర్పంచులు వివిధ శాఖల అధికారులను ప్రశ్నించారు. కాగా, జిల్లా పరిషత్‌ ద్వారా ఏడాది వచ్చిన రూ.10 లక్షల నిధులను మండలంలోని డాకూరు, కన్‌సాన్‌పల్లి, నేరడిగుంట, తాలెల్మ, అక్సాన్‌పల్లి, అందోలు, జోగిపేటల్లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో అభివృద్ధి పనులకు కేటాయించానన్నారు. ఎమ్మెల్యే సూచన మేరకు రూ.3 లక్షలను పోతిరెడ్డిపల్లికి, మరో రూ.5 లక్షలను ఎర్రారం గ్రామానికి కేటాయిస్తున్నానన్నారు. మిగిలిన రూ.3 లక్షలను ఎమ్మెల్యే సూచించిన గ్రామానికి కేటాయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రభులు, ఎంపీడీవో సత్యనారాయణ, ట్రాన్స్‌కో ఏఈ దుర్గయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T05:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising