సిద్దిపేట 283 పాజిటివ్ కేసులు
ABN, First Publish Date - 2020-08-22T10:44:57+05:30
సిద్దిపేట జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యా పిడ్ టెస్టులు 50 చొప్పున చేయాలని నిర్ణయించడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా
పీహెచ్‌సీలలో పెంచిన పరీక్షల సంఖ్య
సిద్దిపేటలో మందుల సరఫరాలో జాప్యం
సిద్దిపేట, ఆగస్టు 21: సిద్దిపేట జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యా పిడ్ టెస్టులు 50 చొప్పున చేయాలని నిర్ణయించడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది. జిల్లాలోని 36పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో 2,120 టెస్టులు చేయగా 250 పాజిటివ్ కేసులు వచ్చాయి. గజ్వేల్ జిల్లా ఆస్పత్రి, గతంలో నిర్వహించిన గొంతుస్రావం పరీక్షలు సంఖ్య కలిపితే ఈ సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం మొత్తం కేసులు త్రిబుల్ సెంచరీకి చేరువలో 283 నమోదయ్యాయి. గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక మండలాల్లో కేసుల సంఖ్య పెరిగింది. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ర్యాపిడ్ టెస్టులు చేశాక పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే మందుల కిట్లు ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. వారి ఫోన్ నంబర్ల ఆధారంగా ఆశావర్కర్లు చిరునామా కనుక్కుని వారి ఇంటికి వెళ్లి మందులు ఇవ్వడానికి ఒకటి, రెండు రోజుల సమయం పడుతున్నది.
ఈ లోగా వారి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదమున్నది. శుక్రవారం సిద్దిపేట అర్బన్‌లో 48, గజ్వేల్‌లో 30, దుబ్బాకలో 26, హుస్నాబాద్‌లో 21 కేసులు వచ్చాయి. సాధారణంగా కోహెడ మండలంలో రోజుకు ఒకటి రెండు కేసులు వచ్చేవి ఒకేసారి 11కు చేరాయి. మండలాల వారీగా బెజ్జంకిలో 14, అక్కన్నపేటలో 12, చేర్యాలలో 13, చిన్నకోడూరులో 9, జగదేవ్‌పూర్‌లో 14, కొండపాకలో 9, మిరుదొడ్డిలో 14, ములుగులో 11, రాయపోల్‌లో 12, సిద్దిపేటరూరల్‌లో 10, నారాయణరావుపేటలో 3, తొగుటలో 8, వర్గల్‌లో 2, నంగునూరులో 7, దౌల్తాబాద్‌లో 5, మద్దూరు మండలం లద్నూర్‌లో 2, కొమురవెల్లిలో 4 కేసులు నమోదయ్యాయి. అయితే కొమురవెల్లి మల్లన్న ఆలయ పూజారి ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Updated Date - 2020-08-22T10:44:57+05:30 IST