ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌, బైక్‌ ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు

ABN, First Publish Date - 2020-12-11T05:56:59+05:30

రాయికోడ్‌, డిసెంబరు 10 : ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొనడంతో ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని చిమ్మాపూర్‌లో చోటు చేసుకున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయికోడ్‌, డిసెంబరు 10 : ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొనడంతో ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని చిమ్మాపూర్‌లో చోటు చేసుకున్నది. ఎస్‌ఐ ఏడుకొండలు వివరాల ప్రకారం సింగితం గ్రామానికి చెందిన రాజశేఖర్‌ బైక్‌పై బీదర్‌ నుంచి వస్తుండగా చిమ్మాపూర్‌ గ్రామ మధ్యలో ఉన్న గురుకుల పాఠశాల వద్దకు రాగానే ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని కుడికాలు, కుడిచేయి విరగడంతో పాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని మొదట 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి వీరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏండుకొండలు తెలిపారు. 

Updated Date - 2020-12-11T05:56:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising