ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ రాష్ట్రస్థాయికి జిల్లా విద్యార్థుల ఐడియా

ABN, First Publish Date - 2020-12-02T05:47:09+05:30

స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ రాష్ట్ర స్థాయికి జిల్లాలోని రేగోడ్‌ విద్యార్థుల ఐడియా ఎంపికైనట్లు జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 1: స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ రాష్ట్ర స్థాయికి జిల్లాలోని రేగోడ్‌ విద్యార్థుల ఐడియా ఎంపికైనట్లు జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి తెలిపారు. యూనిసెఫ్‌, పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌, ఇన్‌క్వి–ల్యాబ్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఛాలెంజ్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 25 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 7,093 ఐడియాలను పంపించారని పేర్కొన్నారు. ఇందులో 25 ఉత్తమ ఐడియాలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయగా, మెదక్‌ జిల్లా నుంచి రేగోడ్‌ జడ్పీహెచ్‌ఎ్‌స పాఠశాల విద్యార్థుల ఐడియా ఎంపికైందని వెల్లడించారు. విద్యార్థులు భరత్‌, యూసుఫ్‌, అభిషేక్‌ రూపొందించిన ‘నీటి వృథాను ఆరికట్టడానికి కలర్‌ కోడ్‌’ ఆధారంగా ప్రజలకు అవగాహన కల్పించే ఐడియా ఉత్తమంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు.

Updated Date - 2020-12-02T05:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising