ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు ఇబ్బంది పెడుతున్నారని పెట్రోల్‌ సీసాతో ఆర్టీసీ డ్రైవర్‌ ఆందోళన

ABN, First Publish Date - 2020-12-30T06:05:05+05:30

ఆర్టీసీ కంట్రోలర్‌ విధుల్లోకి తీసుకోకుండా అవమానించాడని ఆరోపిస్తూ ఓ ఆర్టీసీ డ్రైవర్‌ డిపో మెనేజర్‌ కార్యాలయం ఎదుట భార్యా, పిల్లలతో కలిసి ఆందోళనకు దిగాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి క్రైం, డిసెంబరు 29: ఆర్టీసీ కంట్రోలర్‌ విధుల్లోకి తీసుకోకుండా అవమానించాడని ఆరోపిస్తూ ఓ ఆర్టీసీ డ్రైవర్‌ డిపో మెనేజర్‌ కార్యాలయం ఎదుట భార్యా, పిల్లలతో కలిసి ఆందోళనకు దిగాడు. పెట్రోల్‌ బాటిల్‌తో వచ్చిన డ్రైవర్‌ ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ఆత్యహత్య చేసుకుంటానని భీష్మించాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం ముండ్రాయికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ కె.నాగభూషణం సంగారెడ్డి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఆయన విధులు నిర్వహించడానికి డిపోకు రాగా.. కంట్రోలర్‌ విధుల్లోకి తీసుకోలేదు. అంతేకాకుండా అవమానకరంగా ప్రవర్తించాడు. దీంతో మనస్తాపం చెందిన నాగభూషణం భార్యా, పిల్లలతో కలిసి డిపో మేనేజర్‌ కార్యాలయం ఎదుట పెట్రోల్‌ బాటిల్‌తో ఆందోళనకు దిగాడు. ఆర్డినరీ బస్సులు ఇచ్చి ఎక్స్‌ప్రెస్‌ రూట్లలో నడుపుమంటున్నారని, బ్రేకులు కూడా సరిగ్గా పనిచేయని ఆ బస్సులు నడపలేకపోతున్నామని బాధితుడు వాపోయాడు. అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. దీనిపై డిపో మేనేజర్‌ స్పందించి డ్రైవర్‌తో మాట్లాడి, సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

Updated Date - 2020-12-30T06:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising