ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుదేరా వైన్స్‌లో రూ.14 లక్షల నగదు చోరీ

ABN, First Publish Date - 2020-12-15T05:33:56+05:30

మండలంలోని బుదేరా చౌరస్తాలోని ఓ వైన్స్‌లో చోరి జరిగింది. వైన్స్‌ లాకరులో నుంచి రూ.14 లక్షల నగదును దోచుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునిపల్లి, డిసెంబరు 14  : మండలంలోని బుదేరా చౌరస్తాలోని ఓ వైన్స్‌లో చోరి జరిగింది. వైన్స్‌ లాకరులో నుంచి రూ.14 లక్షల నగదును దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలోని సాయిదుర్గాభవాని వైన్స్‌లో ఆదివారం రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలు జరిగాయి. శుక్ర, శని, ఆదివారం రోజుల్లో మద్యం అమ్మిన డబ్బులు వైన్స్‌లో గల గదిలోని లాకరులో ఆదివారం మద్యం దుకాణం సిబ్బంది దాచారు. సోమవారం దుకాణం తెరిచి చూడగా లాకరులో డబ్బు చోరికి గురైనట్లు నిర్వాహకులు తెలిపారు. నగదు తప్ప మద్యం బాటిళ్లను దొంగతనం చేయలేదని పేర్కొన్నారు.  మూడు రోజుల్లో మద్యం అమ్మగా వచ్చిన డబ్బులు సుమారు రూ.14 లక్షలకు పైగా వుంటాయన్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ బాలాజీ, సీఐ శివలింగం, ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి సందర్శించారు. క్లూస్‌ టీంను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-15T05:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising