ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2020-06-06T10:08:55+05:30

8 నుంచి జూలై 5వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి, మెదక్‌ డీఈవోలు రాజేష్‌, రమేష్‌కుమార్‌


సంగారెడ్డి అర్బన్‌/రామాయంపేట, జూన్‌ 5: 8 నుంచి జూలై 5వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంగారెడ్డి డీఈవో నాంపల్లి రాజేష్‌, మెదక్‌ డీఈవో రమే్‌షకుమార్‌ తెలిపారు. ఛీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు పరీక్షా కేంద్రాలను పరిశీలించి, బెంచీలు, లైట్లు, ఫ్యాన్స్‌, తాగునీరు, టాయిలెట్లు తదితర వసతులు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. ఇన్విజిలేటర్‌ దగ్గు లేదా జలుబుతో బాధపడుతుంటే అతడిని రిలీవ్‌ చేయాలని కోరారు. విద్యార్థులకు కేటాయించబడిన పరీక్షా కేంద్రం వివరాలను డీఈవోసంగారెడ్డి వెబ్‌సైట్‌లో చూసుకోవాలని నాంపల్లి రాజేష్‌ కోరారు.


విద్యార్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికి గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. పాత హాల్‌ టికెట్లతోనే పరీక్షకు హాజరుకావాలన్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ఇన్విజిలేటర్‌, ఏఎన్‌ఎమ్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌కు సమాచారమివ్వాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా విద్యార్థులు పరీక్షలకు సంబంధించి సందేహాలుంటే 08455-276255, 276434 నంబర్లకు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలని డీఈవో నాంపల్లి రాజేష్‌ కోరారు. కాగా, శుక్రవారం మెదక్‌ డీఈవో రమే్‌షకుమార్‌ రామాయంపేట పట్టణంలోని కస్తుర్భా పాఠశాలను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో మొత్తం 108 పరీక్షా కేంద్రాలు ఉండగా, 11,537 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. 


 ఇతర జిల్లాల ఎస్సెస్సీ విద్యార్థులకు ప్రత్యేక సెల్‌

ఇతర జిల్లాలకు చెందిన ప్రైవేట్‌ ఎస్సెస్సీ విద్యార్థుల కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మెదక్‌ డీఈవో రమేశ్‌కుమార్‌ తెలిపారు. ప్రైవేట్‌ హస్టళ్లలో ఉండే ఇతర జిల్లాల విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు జిల్లా కేంద్రంలో ఉన్న విద్యాఽశాఖ కార్యాలయంలో వివరాలు తెలియజేస్తే వసతి గృహాలకు వెళ్లే సౌకర్యం కల్పిస్తామన్నారు. 

Updated Date - 2020-06-06T10:08:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising