ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పీఆర్సీని అమలు చేయాలి’

ABN, First Publish Date - 2020-02-20T07:12:24+05:30

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సాయంత్రం జాక్టో, యూఎ్‌సపీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ అర్బన్‌, ఫిబ్రవరి 19 : ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సాయంత్రం జాక్టో, యూఎ్‌సపీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ప్రణీద్‌కుమార్‌, కాముని రమేశ్‌, సత్యనారాయణ, పద్మారావు మాట్లాడుతూ జూలై 1, 2018 నుంచి ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్‌ అదే సంవత్సరం జూన్‌ 2 నుంచి ఐఆర్‌, ఆగస్టు 15 నుంచి పీఆర్సీ అమలుచేస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకూ హామీ నెరవేరలేదన్నారు. పేరివిజన్‌ కమిషన్‌ను నియమించి మొదటి నెలరోజుల్లో నివేదిక సమర్పించాల్సిందిగా గడువు విధించి, పలుమార్లు ఆ గడువును పొడిగిస్తూ 24న చివరితేదీగా నిర్ణయించారు. మళ్లీ ఆ గడువు 8 నెలలపాటు డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేయడం సమంజసం కాదన్నారు. వెంటనే ఆ ఉత్తర్వులు రద్దుచేసి పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 69 శాతం ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీని అమలు చేయాలన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావుకు పీఆర్సీ అమలుచేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ సమితి, పోరాట కమిటీ నాయకులు హీరాలాల్‌, కిషన్‌, హైమద్‌, సుధాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-20T07:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising