డ్రైనేజీ పక్కన పసికందు
ABN, First Publish Date - 2020-10-04T10:39:34+05:30
కళ్లు తెరిచి 24 గంటలు గడవకుండానే ఓ పసికందు డ్రైనేజీ చెంతకు చేర్చారు. పాప కుటుంబసభ్యులే ఆటోలో వచ్చి పాపను
తల్లిదండ్రులే వదిలిపెట్టినట్టు గుర్తించిన పోలీసులు
రామచంద్రాపురం, అక్టోబరు 3 : కళ్లు తెరిచి 24 గంటలు గడవకుండానే ఓ పసికందు డ్రైనేజీ చెంతకు చేర్చారు. పాప కుటుంబసభ్యులే ఆటోలో వచ్చి పాపను విడిచి వెళ్లినట్టు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. పాప తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీ్‌సస్టేషన్ పరిధిలోని అన్నమయ్య ఎన్‌క్లేవ్ సమీపంలో శనివారం ఉదయం డ్రైనేజీ పక్కన ఓ పసికందు కనిపించింది. అటు వైపుగా వెళ్తున్న ఓ మహిళ గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వెళ్లి చూడగా పాప సురక్షితంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎవరి బిడ్డ అయి ఉంటుందని ఆరా తీయగా.. గురువారం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ పాపకు జన్మనిచ్చిందని తెలిసింది. వాళ్ల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్టు సీసీ ఫుటేజీ ద్వారా పరిశీలించారు.
ప్రసవించిన మరుసటి రోజు పాపను తీసుకుని ఆటోలో వెళ్లి రామచంద్రాపురంలోని అన్నమయ్య ఎన్‌క్లేవ్ డ్రైనేజీ వద్ద వదిలిపెట్టినట్టు స్పష్టమైంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు పసికందు డ్రైనేజీ పక్కనే ఉన్నది. సీసీ ఫుటేజీ ద్వారా పాప తల్లిదండ్రులు నల్లగండ్లలో నివాసముంటున్న గుల్బర్గా వాసులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడూ కుక్కలు, పందులు, విషపురుగులు సంచరించే ఆ ప్రాంతంలో పాప సురక్షితంగా ఉండడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Updated Date - 2020-10-04T10:39:34+05:30 IST