ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ ప్రక్షాళనలో పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-05-13T05:48:21+05:30

భూ ప్రక్షాళనలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతు పండించిన ప్రతీ గింజను కొంటాం

మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌


పాపన్నపేట, మే 12: భూ ప్రక్షాళనలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సూచించారు. మంగళవారం పాపన్నపేట మండలంలో పర్యటించిన ఆయన కొత్తపల్లిలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం వేర్వేరుగా రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేవిధంగా చూడాలని సూచించారు.


ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొనుగోళ్లు దగ్గర పడ్డట్లు స్పష్టం చేశారు.  పాపన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో కొంతమంది రైతులకు ఇప్పటి వరకు పాస్‌ బుక్‌లు అందని విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే ఆ రైతులకు పాస్‌బుక్‌లు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ రాములును అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మండల వ్యవసాయ అధికారి ప్రతాప్‌, వీర్వోలు, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-13T05:48:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising