ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సాపూర్‌ అడవులు అద్భుతం

ABN, First Publish Date - 2020-07-26T10:43:57+05:30

నర్సాపూర్‌ అడవులు ఎంతో అద్భుతమని, ఇవి ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో ఉపయోగపడతాయని అటవీశీఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ శాంతకుమారి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అటవీశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి 


నర్సాపూర్‌, జూలై 25 : నర్సాపూర్‌ అడవులు ఎంతో అద్భుతమని, ఇవి ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో ఉపయోగపడతాయని అటవీశీఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ శాంతకుమారి పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్‌ సమీపంలోని అర్బన్‌ పార్కును ఆమె, పీసీసీఎ్‌ఫలు శోభ, లోకే్‌షజైస్వాల్‌, కన్జర్వేటర్‌ శర్వానణ్‌, డీఎ్‌ఫవో పద్మజారాణి, ఎఫ్‌ఆర్‌వో గణేష్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పార్కు సమీపంలో మొక్కలను నాటారు.


అనంతరం వాచ్‌టవర్‌, ఔషధ మొక్కలను పరిశీలించి వివరాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ నర్సాపూర్‌ అడవులు ఒకప్పుడు దట్టంగా ఉండేవని, తిరిగి పూర్వవైభవం తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడవుల పునరుద్ధరణ చేపట్టిందన్నారు. నర్సాపూర్‌ అడవులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండడం, ఇక్కడ అర్బన్‌ పార్కును ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. పర్యాటకులు ఇష్టానుసారంగా కాకుండా బాధ్యతాయుతంగా ఉంటూ పర్యటించాలని తెలిపారు. 

Updated Date - 2020-07-26T10:43:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising