ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్ నియామక ఉచిత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్

ABN, First Publish Date - 2020-12-03T16:42:47+05:30

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 34 ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రాలు ప్రారంభించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్ధిపేట: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 34 ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రాలు ప్రారంభించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోలీస్ నియామక ఉచిత శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015 నుండి పోలీస్ ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందించామని... ఉచిత శిక్షణ వల్ల చాలా మంది ఉద్యోగాలు సాధించారని తెలిపారు. శిక్షణ పొంది రాష్ట్ర స్థాయి ఉద్యోగాలే కాకుండా జాతీయ స్థాయిలో వచ్చే ఉద్యోగాలకు కూడా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. నిరంతర ప్రయత్నం ద్వారానే లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు.  అసాధ్యం అనేది ఏదీ లేదని, ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధ్యమని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా హాజరు అయితే స్టడీ మెటీరియల్, టిఫిన్, స్పోర్ట్స్ మెటీరియల్, యూనిఫాం తదితర సౌకర్యాలు అందిస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-03T16:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising