ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక ఇంటి వద్దకే వైద్య సేవలు.. మొబైల్‌ పాలియేటివ్‌ కేర్‌ చికిత్స షురూ

ABN, First Publish Date - 2020-07-06T20:47:48+05:30

కేన్సర్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు చివరి దశలో వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వెళ్లడం ఇబ్బందికరమే. అలాంటి వారికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలుత ఐదు పీహెచ్‌సీ పరిధుల్లో ప్రారంభం


సంగారెడ్డి అర్బన్‌(ఆంధ్రజ్యోతి) : కేన్సర్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు చివరి దశలో వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వెళ్లడం ఇబ్బందికరమే. అలాంటి వారికి ఉపశమనం కోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ షుగర్‌, కేన్సర్‌, పక్షవాతంతో బాధపడుతూ చివరి దశలో ఉన్న బాధితులకు పాలియేటివ్‌ కేర్‌ ప్రోగ్రాం కింద ఇంటి వద్దనే వ్యాఽధి ఉపశమనం, సంరక్షణ వైద్య సేవలందించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ సేవలను జిల్లాలో ప్రారంభించింది. 


జిల్లాకు ఆలనా వాహనం

ఇంటి వద్దకే పాలియేటివ్‌ కేర్‌ సేవలను అందించేందుకు జిల్లాకు ఇప్పటికే ‘ఆలనా’ పేరిట ప్రత్యేక వాహనాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. వైద్య సేవలు అందించేందుకు ఆయూష్‌ మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్సును నియమించారు. వారు ఆ వాహనంలో జిల్లాలోని భాదితుల ఇంటింటికీ వెళ్లి వైద్య చికిత్స అందించనున్నారు.


మొదట మల్లేపల్లిలో సేవలు ప్రారంభం

మొబైల్‌ పాలియేటివ్‌ కేర్‌ సేవలు మొదట జిల్లాలోని కొండాపూర్‌ మండలం మల్లేపల్లిలో ప్రారంభించారు. తొలి రోజు 15 మంది ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలందించారు. బాధిత వ్యాధిగ్రస్థులకు మందులు, ఫిజియోథెరపి, ఇతర వైద్య పరీక్షలు చేశారు. మొదటి విడతగా జిల్లాలోని కొండాపూర్‌, కంది, హత్నూర, ఆత్మకూర్‌, దౌల్తాబాద్‌ ఐదు పీహెచ్‌సీ పరిఽధుల్లో మొబైల్‌ పాలియేటివ్‌ హెల్త్‌ హోం కేర్‌ సేవలు అందుబాటులోకి తెచ్చామని ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-07-06T20:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising