ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువు కట్ట ఆక్రమణదారులపై కొరడా

ABN, First Publish Date - 2020-03-08T07:17:24+05:30

మండల కేంద్రంలోని కిసాన్‌ సాగర్‌ చెరువు కట్టను కొందరు రియల్‌ వ్యాపారులు ఆక్రమించాలని చూశారు. రాత్రికి రాత్రే నిబంధనలకు విరుద్ధంగా చెరువు కట్టను తవ్వి, కట్ట పక్కన ఉన్న స్థలాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హద్దురాళ్లను తొలగించిన రియల్టర్లు
  • తిరిగి హద్దులను ఏర్పాటు చేస్తూ కడీలు పాతించిన అధికారులు
  • కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం
  • స్పష్టం చేసిన ఇరిగేషన్‌ డీఈ సురేశ్‌, ఉప తహసీల్దార్‌ మల్లయ్య


కంది, మార్చి 7: మండల కేంద్రంలోని కిసాన్‌ సాగర్‌ చెరువు కట్టను కొందరు రియల్‌ వ్యాపారులు ఆక్రమించాలని చూశారు. రాత్రికి రాత్రే నిబంధనలకు విరుద్ధంగా చెరువు కట్టను తవ్వి, కట్ట పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు. చెరువు కట్టకు ఆనుకుని ఉన్న స్థలాన్ని చదును చేసి హద్దురాళ్లనూ పాతారు. గమనించిన కంది సర్పంచ్‌ విమల శుక్రవారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు స్థలాన్ని పరిశీలించారు. శనివారం గ్రామపెద్దలు, వార్డు సభ్యులతో కలిసి రెవిన్యూ, ఇరిగేషన్‌ అధికారులు చెరువు కట్ట ఆక్రమణదారులపై  కొరఢా ఝులిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలం సర్వే నంబరు 476లో వేసిన హద్దురాళ్లను తొలగించారు. ఎక్స్‌కవేటర్‌ సాయంతో తిరిగి హద్దులను ఏర్పాటు చేశారు. సదరు వెంచరుదారులకు నోటీసులు జారీ చేసి హెచ్చరికలు చేశారు. అక్రమంగా చెరువు కట్టను తవ్వినందుకు  నష్టపరిహారం కట్టిస్తామని అధికారులు తెలిపారు. వాల్టా చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్‌ మల్లయ్య చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ డీఈ సురేశ్‌, ఉపసర్పంచ్‌ ఖాజా, జంగయ్య, నరేందర్‌, మహేందర్‌ ఉన్నారు.

Updated Date - 2020-03-08T07:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising